ముదినేపల్లి మండలంలోని కోమర్రు శివారు చినకోమర్రులో చెరువుపై గడ్డి కోస్తున్న యువకుడు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం. గ్రామానికి చెందిన తేలు సాయి (26) బుధవారం గ్రామంలోని చెరువుపై వరిగడ్డి కోసం వెళ్లి, కోస్తుండగా కత్తికి విద్యుత్తు తీగ తగిలి ప్రమాదం సంభవించింది. ఇతను డెలివరీ బాయ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.