రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టును పెట్టినందుకు కృష్ణా జిల్లా కంకిపాడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి బొర్రా వెంకట్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి మచిలీపట్నం తరలించారు. ఈ నెల 27వ తేదీన ఉయ్యూరులో జరిగిన నిరసన దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అదుపులోకి తీసుకున్నారని మరో టాక్ కూడా నడుస్తోంది. సమాచారం అందుకున్న కంకిపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.