దేశవ్యాప్తంగా నేడు జరగాల్సిన పీఎం యశస్వి పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) రద్దు చేసింది. శుక్రవారం పరీక్ష నిర్వహిస్తామని తొలుత ప్రకటించగా.. చివరి నిమిషంలో పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించేందుకు ప్రతి ఏటా యశస్వి పరీక్షను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది పరీక్ష ద్వారా కాకుండా 8, 10 తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను స్కాలర్‌షిప్‌నకు ఎంపిక చేస్తామని ఎన్‌టీఏ తెలిపింది.