ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. లోకేశ్ ముందస్తు బెయిల్‌ను డిస్పోస్ చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లోకేశ్‌కు 41A నోటీస్ ఇవ్వమని కోర్టు చెప్పగా.. ఇందుకు ఏజీ శ్రీరామ్ అంగీకారం తెలిపారు. మరోవైపు విచారణకు సహకరించాలని లోకేశ్‌ను కోర్టు ఆదేశించింది. అంతకుముందు లోకేశ్ తరఫున లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.