కేరళలో ఇటీవల కలకలం సృష్టించిన నిపా వైరస్ ప్రస్తుతం కనుమరుగైంది. ఆ వైరస్ సోకిన నలుగురు ప్రస్తుతం డబుల్ నెగెటివ్ తేలారు. దీంతో తమ రాష్ట్రం నుంచి వైరస్ వెళ్లిపోయినట్లు మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. కోజికోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆ నలుగురు నిపా వైరస్ నుంచి తేరుకున్నట్లు ఆమె వెల్లడించారు. రెండు సార్లు వాళ్లకు వైరస్ పరీక్ష చేశామని, రెండు సార్లు వాళ్లు నెగటివ్‌గా వచ్చినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa