విష జ్వరాలు, సీజనల్ వ్యాధులతో వార్డు ప్రజలు అవస్థలు పడుతుంటే కంచరపాలెంలో గల అర్బన్ హెల్త్ సెంటర్ మూసివేయడం పై 48వ వార్డ్ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు అసహనం వ్యక్తం చేశారు. గురువారం వార్డు పర్యటనలో భాగంగా ఇది గమనించిన ఆమె ఆసుపత్రి సిబ్బంది పై మండిపడ్డారు. అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ కు అత్యవసర సేవలు నుంచి మినహాయింపు ఇచ్చారా అని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు.