ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు బతుకు బండి లాగడానికే వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టినట్టు ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. వాహనం ఇన్యూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర సొమ్మును వినియోగించుకోవాలని కోరారు. ఇవాళ రూ.276 కోట్లు జమ చేస్తున్నామని, వైఎస్సార్ వాహన మిత్రతో ఐదేళ్లలో ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ది జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదని విమర్శించారు.