వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత సాయాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్లో జరిగే సభలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందించారు.