పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్ చెప్పింది. అధిక వేతనాలపై పెన్షన్‌కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్లోడింగ్ కోసం మరో మూడు నెలల గడువును పెంచుతున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగుస్తుండగా.. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు 2023 ఏడాది చివరి వరకు గడువును పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.