విశాఖపట్నంలో వైఎంసీఏ బీచ్ తీరానికి శుక్రవారం రాత్రి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకుని వచ్చింది. దీన్ని గమనించిన కొందరు పర్యాటకులు, మత్స్యకారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భారీ చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు. ఈ పెట్టెను బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa