ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు వల్ల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాడు. స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.