టీడీపీ అధినేత చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులుపెట్టి జైలులో పెట్టారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. అరెస్ట్ చేసి 20 రోజులైనా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... నాయకుడిని అరెస్ట్ చేస్తే టీడీపీ శ్రేణులు మనోధైర్యం కోల్పోతారు అనుకున్న వైసీపీ నేతల ఆలోచనలకు భిన్నంగా ప్రజలు చంద్రబాబు కోసం రోడ్లపైకి వస్తున్నారు. ప్రజా క్షేత్రంలో వైసీపీ కుట్ర రాజకీయాలను ఎండగడతాం. దుర్మార్గ పాలనను అంతమొందించటానికి జనసేనతో కలిసి పని చేస్తాం అని తెలియజేసారు.