జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. నంద్యాలలోపార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసులకు తాము భయపడేది లేదని తేల్చిచెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు.