హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి కౌంటరిచ్చారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హత్యకు సంబంధించి సరైన ఆధారాలుంటే పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఇరు దేశాలు ఈ విషయంలో పరస్పరం విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.