జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఇదిలావుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సభ నిర్వహించడం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని, రాష్ట్రంలో జనసేన-టీడీపీ సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పవన్ అన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. వారాహి యాత్ర యువగళం= వరాహగళం... 'అవనిగడ్డ' ఫ్లాప్ అయిందని వరాహగళం నిరూపించింది అని వివరించారు. 1 1=2 అనేది గణితంలో వర్తిస్తుందని, కానీ రాజకీయాల్లో కొన్నిసార్లు 1 1=0 అవుతుందని ఎద్దేవా చేశారు.