పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బడి బ్యాగు బరువు కారణంగా.. భుజాలు వంగిపోయి నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారని తెలిపింది. 22 శాతం మంది విద్యార్థులు కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి, వెన్ను నొప్పి లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.