గ్లోబల్ టీచర్ ప్రైజ్–2023 విజేతను ఎంపిక చేసేందుకు రూపొందించిన టాప్–50 జాబితాలో భారత్‌కి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు పి.హరికృష్ణ, దీప్ నారాయణ్ నాయక్ చోటు దక్కించుకున్నారు. హరికృష్ణ ఏపీలోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం ZPHSలో పనిచేస్తుండగా, నాయక్ పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్సోల్ జిల్లాలో ప్రాథమిక పాఠశాల టీచర్‌గా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో అవార్డు విజేతను ప్రకటించనున్నారు.