మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సోమవారం మాంసం అంగళ్లు బంద్ చేయాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేశారు. పట్టణంలోని అన్ని మాంసం అంగళ్లకు 2వ తేదీ మూసివేయాలని మున్సిపల్ సిబ్బంది నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే తీవ్ర పరిణాలు తప్పవని హెచ్చరించారు.