జర్నలిస్టుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని ఏపీయుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, మంత్రాలయం తాలూకా అధ్యక్షులు జయరాజు డిమాండ్ చేశారు. సోమవారం మంత్రాలయంలో సేవ్ జర్నలిజం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించి, రాఘవేంద్ర స్వామి సర్కిల్ నందు శాంతియుతంగా ఆందోళన జరిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టుల చట్టాలను కాలరాస్తుందని దుయ్యబట్టారు.