కాకినాడలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో సోమవారం బాలాజీ చెరువు సెంటర్ నందు ప్రజాస్వామ్యానికి సంకెళ్లు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు చేయడం దారుణం మని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టమన్నారు.