ప్రతి ఒక్కరూ గాంధీజీ చూపిన బాటలో పయనించాలని అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నాగులపల్లి. ధనలక్ష్మి అన్నారు. సోమవారం రంపచోడవరం నియోజకవర్గం ఎల్లవరంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించి గాంధీజీ చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ అహింస ఆయుధంగా బ్రిటిష్ వారిని ఎదిరించి శాంతి యుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రం అందించారని కొనియాడారు.