బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో కడప నగరంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఎదురుగా బ్లాక్ డే నిరసనను మంగళవారం నిర్వహించారు. బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రతిఘటించాలని డిమాండ్ చేశారు. లకిమ్ పూర్లో రైతులపై కాల్పులు జరిపి ప్రాణాలను తీసిన మంత్రిని భర్తరఫ్ చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు.