మంగళవారం చీపురుపల్లి సచివాలయం ఐదులో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సోమేశ్వరి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగళగిరి సుధారాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సోమేశ్వరి, ఏ. ఎన్. ఎం ఆశావర్కర్ పాల్గొన్నారు.