చైనాలో ఘోర ప్రమాదం జరిగి 55 మంది సబ్ మెరైనర్లు మృతి చెందారు. చైనాకు చెందిన అణుశక్తి సబ్ మెరైన్ 093-417 ఆగష్టులో ప్రమాదానికి గురికాగా 55 మంది మరణించారు. ఈ ఘోరాన్ని చైనా దాచి పెట్టింది. బ్రిటన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా నౌకాదళ నిపుణులు ఆగష్టులో ప్రమాదం గురించి చెప్పినా చైనా, తైవాన్ తోసిపుచ్చాయి.