ఇద్దరు స్నేహితులను అదృష్టం వరించింది. పంజాబ్ లోని ఫాజిల్కా జిల్లాకు చెందిన అబోహర్ రమేష్, కుక్కి చిన్ననాటి స్నేహితులు. వారిద్దరికి చిన్నప్పటి నుంచి లాటరీలు కొనుగోలు చేయడం అలవాటు. ఇటీవల రూ.100 లాటరీ టికెట్లను ఇద్దరు కలిసి కొన్నారు. అందులో ఒక టికెట్ పై రూ.కోటిన్నర గెలుచుకున్నారు. దీంతో ఘంటాగర్ చౌరస్తా వద్ద వారు వేడుకను చేసుకున్నారు. ఈ నగదు పిల్లలకు, సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్నారు.