వందే భారత్ రైళ్లకు త్వరలో స్లీపర్ కోచ్ రైళ్లు జతకానున్నాయి. 2024 మార్చి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తాజాగా స్లీపర్ రైలుకు సంబంధించిన ఫోటోలను మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. రాత్రిపూట ప్రయాణించే వారికి అత్యంత సౌకర్యంగా ఉండేలా బెర్త్‌లను తీర్చిదిద్దారు. మొత్తం 857 బెర్త్‌లు ఉంటాయి. వీటిలో ప్రయాణికుల కోసం 823, సిబ్బంది కోసం 34 అందుబాటులో ఉంటాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని నిర్మిస్తున్నారు.