మంగళగిరి గణపతి నగర్లోని యూపీహెచ్సీలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపులో 13 రకాల వైద్య సేవల విభాగాలను ఏర్పాటు చేశారు. రోగులకు 8 మంది వైద్యులు, 4గురు స్పెషలిస్టులు వైద్య సేవలు అందించారు. 641 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శిబిరాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, జేఏఎస్ స్టేట్ మోడల్ ఆఫీసర్ ఇంతియాజ్, ఎమ్మెల్సీ హనుమంతరావు సందర్శించారు.