టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బుధవారం నాటికి ఈ రిలే నిరాహార దీక్షలు 22 రోజులకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.