వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రతి ఇంటా ఆరోగ్య రక్షణ కోసమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో ఏకంగా 51 వేల పోస్టులు భర్తీ చేసినట్లు ఎమ్మెల్యే అనంత తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గ్రామీణ స్థాయి నుంచే మెరుగైన వైద్య సదుపాయాలు అందించే దిశగా విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశామన్నారు.