నేడు పెడనలో జరగబోయే వారాహి యాత్రపై దాడి చేసే అవకాశం ఉందంటూ పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి , పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందిస్తూ.... పవన్‌కళ్యాణ్‌ను నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నీవు చేస్తున్న ఆరోపణలను నిరూపించి చూపితే.. నీ వారాహి యాత్రకు నేనే స్వయంగా వచ్చి వీధి వీధి తిరిగి నీమీద చిన్న ఈగ కూడా వాలకుండా చూస్తాను. నా నియోజకవర్గం నుంచి నిన్ను పూర్తి సేఫ్‌గా దాటిస్తాను. మరి నా సవాల్ స్వీకరిస్తావా? అని సవాల్ విసిరారు.