ప్రమాదాల నివారణలో అన్ని శాఖల సమన్వయంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో విజయనగరం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ఓవర్ లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వాడకం, సెల్ ఫోన్ డ్రైవింగ్ పై డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. కళాశాలల్లో, విద్య సంస్థల్లో యువతకు అవగాహన కల్పించాలని అన్నారు.