జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో కనగానపల్లి మండలం విహెచ్పిఎస్ నాయకుడు నరసింహులు సమీప బంధువు పెద్దన్న అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకొని విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న బాధితుణ్ని బుధవారం పరామర్శించారు. ఆయనతో పాటు ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు బండారు కదిరప్ప ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు రేకులకుంట రామాంజనేయులు కనగానపల్లి మండల విహెచ్పిఎస్ నాయకులు ఉన్నారు.