బొమ్మనహాళ్ పోలీసు స్టేషన్ పరిధిలోని తుంగభద్ర ఎగువ కాలువలో గత వారం శవమై తేలిన మృత దేహం కేసును రాయదుర్గం రూరల్ పోలీసులు ఛేదించారు. హత్య కేసుగా నమోదు చేసి అతి తక్కువ వ్యవధిలోనే కేసును ఛేదించడంతో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ ట్రాక్టర్ మరియు 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం డిఎస్పి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.