నగరి పట్టణ షాపింగ్ కాంప్లెక్స్ నూతన భవనం నిర్మాణానికి 2 కోట్ల 30 లక్షల 36 వేల రూపాయలతో 31 రూములతో సంత మైదానం నందు బుధవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల యువజనసర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగరి మున్సిపాలిటీ, వైఎస్ఆర్సిపి సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు.