రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అధికార వైసీపీ అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ....... ‘రానున్న ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో వైసీపీ 20 పార్లమెంటు స్థానాలను గెలుస్తుందని రూ.8కోట్ల ఆదాయాన్ని ఏటా ప్రభుత్వం నుంచి పొందుతున్న ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ అనే ఆంగ్ల దినపత్రిక తన సర్వేలో వెల్లడించింది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ సర్వే నిర్వహించామని, దాని అంచనాలే ఇవి అని’ ఆ పత్రిక పేర్కొనడంపై అంతా నవ్వుకుంటున్నారని రఘురామ కృష్ణరాజు తెలిపారు.