రేషన్ సరుకుల పంపిణీలో ఏమైనా అవకతవకలు జరిగాయని ఫిర్యాదు అందితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి మండలం తహసిల్దార్ ఉయ్యాల పుల్లారావు బుధవారం హెచ్చరించారు. డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు ఎవరైనా బియ్యం ఇవ్వకుండా కార్డుదారులకు డబ్బులు ఇవ్వడం బియ్యం తక్కువ ఇవ్వడం లాంటివి జరిగినట్లు ఫిర్యాదు వస్తే చర్యలు తప్ప వాని ఆయన అన్నారు.