స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు తరపున లాయర్ ప్రమోద్‌కుమార్ దుబే వాదనలు వినిపిస్తూ.. 'స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కె. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు' అని పేర్కొన్నారు.