విద్యార్థులకు సంబంధించి కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు అన్ని పాఠశాలల్లో వెల్నెస్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు తమ భావాలను వ్యక్తపరిచేలా ప్రోత్సహించాలని, ఇతర విద్యార్థులతో పోలికను నివారించాలని స్పష్టం చేసింది. ఇక పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం శాశ్వతం కాదని, విద్యలో ప్రతిభపైనే విజయం ఆధారపడదనే విషయాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలని పేర్కొంది.