జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎం చేపడుతున్న మెడికల్ చెకప్ సర్వేను పక్కాగా నిర్వహించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి బెల్లుపడ కాలని సచివాలయం 2 పరిధి 13వ వార్డులో మంగళవారం ఏఎన్ఎంలు చేపడుతున్న మెడికల్ చెకప్ సర్వే ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కూడా జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో పరీక్షలు చేయించుకున్నారు.