పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం చామర్రులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ రెడ్డి చేతిలో ఏపీ యువత మోసపోయిందని వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. అన్ని గ్రామాల్లో చాలా మంది ప్రజలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టు జీర్ణించుకోలేక ప్రాణాలు వదులుతున్నారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో నియోజకవర్గంలో ఇప్పటికే కొందరు మరణించారని తెలిపారు. భువనేశ్వరితో కలిసి వారి కుటుంబాలను ఓదారుస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 స్ధానాలు టిడిపి గెలిచి తీరుతుందని కొమ్మాలపాటి శ్రీధర ధీమా వ్యక్తం చేశారు.