మంత్రి రోజాపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా మాట్లాడుతున్నవి చాగంటి గారి ప్రవచనాలా అంటూ ఎద్దేవా చేశారు. రోజాని చూసి మహిళ జాతి సిగ్గు పడుతోందన్నారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీలో రోజా చేసిన పనులు దగ్గరుండి చూశామన్నారు. వైసీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం తొక్కుతోందని మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే.. జగన్ కాదు కదా జగన్ తాత కూడా అపలేడని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బాధ్యతలు మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.