ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. 13 యూనిట్స్‌కు సంబంధించి ప్రారంభోత్సవం, శంఖుస్ధాపనలు, ఎంవోయూలు చేస్తున్నామని సీఎం తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌ర్ సమిట్‌లో భాగంగా 386 అవగాహన ఒప్పందాలు కుదిరాయని.. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వీటిని వేగంగా ప్రతినెలా మీటింగ్‌లు పెట్టి కార్యరూపం దాల్చేలా ఫాలోఅప్ చేస్తున్నామని చెప్పారు. సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కమిటీని దాని కోసం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలను చేయిపట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో ఈరోజు మూడు ప్రారంభోత్సవాలతో పాటు 9 శంఖుస్ధాపనలు 1 ఎంవోయూ చేస్తున్నామని అన్నారు. రూ.3058 కోట్లు పెట్టుబడితో 6755 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమం ఇది అని చెప్పారు. 14 జిల్లాల్లో వస్తున్న అన్ని పరిశ్రమల వల్ల 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.