గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్) ఎముకలు, కీళ్ళ విభాగం మూడో యూనిట్ వైద్యులు ఆపరేషన్ అవసరం లేకుండానే వంకర కాళ్లను సరిచేశారు. కాళ్లు మెలితిరిగి పోయి ఇబ్బందులు పడుతున్న పలువురు చిన్నారులకు విజయవంతంగా చికిత్స చేశారు. దీనిపై ఆ విభాగాధిపతి డాక్టర్ ఎ. శ్రీనివాస్, వైద్య బృందాన్ని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కుమార్ అభినందించారు. ఈ మేరకు వివరాలను బుధవారం వెల్లడించారు.