విశాలాక్షినగర్ పదోవార్డు పరిధిలోని సుందర నగర కొండవాలు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పదోవార్డు సుందర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పోలవరపు సాయి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అప్పులపాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు వచ్చి డబ్బులు అడుగుతుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరిలోవ సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.