గూడెం కొత్త వీధి మండలంలోని ఆర్వి నగర్ సమీపంలోని బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం మండలంలోని రామగెడ్డ సమీపంలోని భారీ టిప్పర్ లారీ అదుపుతప్పి పశువుల మంద పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అధిక సంఖ్యలో ఆవులు ఎద్దులు మేకలు మృతి చెందాయని బాధిత యజమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదానికి కారకులైన టిప్పర్ లారీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత గిరిజనులు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa