ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటంలో భాగంగా గురువారం సాయంత్రం ఉక్కు ముఖద్వారం సమీప కూర్మన్నపాలెం కూడలిలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో 900 రోజులకు పైగా ఉద్యమిస్తున్నా. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సీపీఎం సభకు ప్రాధాన్యత సంతరించుకుంది.