ఆత్మకూరు మండలంలోని ముట్టాల గ్రామంలో గురువారం జగనన్న ఆరోగ్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే వైద్యా ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేసి టోకెన్లు ఇచ్చారని, వారంతా తప్పకుండా సురక్ష శిబిరానికి హాజరు కావాలన్నారు. అలాగే అనారోగ్యంగా బాధపడుతున్న వారెవరైనా సురక్ష శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందవచ్చన్నారు.