ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం తర్లుపాడు మండలంలోని సచివాలయ కన్వీనర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాలలో ప్రజా సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని దిశా నిర్దేశం చేశారు.