ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పులసుబ్బయ్య కాలనీలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు.