ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఈ నెల 6వ తేదీన జరగనున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాచర్ల ఎమ్మార్వో దిలీప్ కుమార్ గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్పందన కార్యక్రమంలో తమ సమస్యలు తెలిపేందుకు రాచర్ల మండల ప్రజలు ఒంగోలు వెళ్లవలసిన అవసరం లేదని 6వ తేదీన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో రాచర్ల మండల కేంద్రంలో స్పందన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.